Thursday, April 16, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుపెంబి ఆస్పిరేషన్ బ్లాక్ అభివృద్ధి చర్యలు అభినందనీయం

పెంబి ఆస్పిరేషన్ బ్లాక్ అభివృద్ధి చర్యలు అభినందనీయం

📰 Generate e-Paper Clip

నవగీతం, నిర్మల్

నిర్మల్ జిల్లా పెంబి ఆస్పిరేషన్ బ్లాక్ అభివృద్ధికి అధికారులు చేపట్టిన చర్యలు అభినందనీయమని నితి అయోగ్ ఆస్పిరేషన్ బ్లాక్ ప్రత్యేక అధికారి శిల్పా రావు అన్నారు.మంగళవారం పెంబి ఆస్పిరేషన్ బ్లాక్ సందర్శన చేసినందున నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అధికారులతో కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రాత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ, పెంబి ఆస్పిరేషన్ బ్లాక్ లో చేపట్టిన పనులు బాగున్నాయని అన్నారు. రానున్న రోజుల్లో మరింత మెరుగ్గా అధికారులు సమన్వయంతో పని చేసి పెంబి బ్లాకు సమగ్రంగా అభివృద్ధి చేయాలని తెలిపారు. పెంబి బ్లాకు అభివృద్ధికి ఎటువంటి సహకారం కావాలన్న అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.కలెక్టర్, అధికారులు ప్రత్యేక అధికారిని శాలువాలతో సన్మానించి, జ్ఞాపికలు అందించారు.ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డిఆర్డిఓ విజయలక్ష్మి, వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, వైద్యారోగ్య శాఖ అధికారి రాజేందర్, డీఈవో భోజన్న, పశు వైద్య శాఖ అధికారి బాలిక్ అహ్మద్, ఎల్డీఎం రామ్ గోపాల్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular