Thursday, February 26, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలపవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన సందర్భంగా ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్

పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన సందర్భంగా ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్

📰 Generate e-Paper Clip

నవగీతం, జగిత్యాల

జనవరి 3న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మరియు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ లు పరిశీలించారు.డిప్యూటీ సిఎం పర్యటన సందర్భంగా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, సభా స్థల ఏర్పాట్లు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేశారు.అనంతరం హెలిప్యాడ్, శిలాపలకం మరియు గుడి ఆవరణ ప్రదేశంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పర్యటనను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular