Thursday, February 26, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలజువ్వాడి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళ

జువ్వాడి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళ

📰 Generate e-Paper Clip

నవగీతం, మెట్ పల్లి

స్వర్గీయ మాజీమంత్రి రత్నాకర్ రావు స్మారకార్థం కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు ఆధ్వర్యంలో నరేందర్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో జనవరి 4వ తేదీ న ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మెగా జాబ్ మేళా  నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. జువ్వాడి భవన్ లో మెగా జాబ్ మేళా కరపత్రాన్ని ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేన్స్ సెమికాన్ కంపెనీలో ఒక సంవత్సరం అప్రెంటినీ షిప్ ట్రైనింగ్ , ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలో ఒప్పందంతో జాబ్స్ మేళా నిర్వహిస్తున్నాని తెలిపారు. పదవ తరగతి ఇంటర్ డిగ్రీ తో 18 సంవత్సరాల నుండి 34 సంవత్సరాల లోపు ఉన్న నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కల్పించాలని ఉద్దేశంతో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular