నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి:
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మెట్ పల్లి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కూన గోవర్ధన్ మాట్లాడుతూ..డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భారతదేశంలో పుట్టడం మన అందరి అదృష్టమని పేర్కొన్నారు. ఆయన ఒక అద్భుతమైన ప్రతిభాశాలి,విజ్ఞాన గని అని కొనియాడారు. భారత రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్యానికి బలమైన పునాదులు వేసి, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశాన్ని నిలబెట్టిన గొప్ప దార్శనికుడు అంబేద్కర్ అని అన్నారు.కార్మికుల హక్కుల పరిరక్షణలో అంబేద్కర్ పాత్ర విశేషమని, పని గంటలను 12 నుంచి 8 గంటలకు తగ్గించేలా కృషి చేసిన దార్శనికుడు అని అన్నారు. ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించి ప్రజలను పాలకులుగా తీర్చిదిద్దిన గొప్ప నాయకుడు అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఏయంసి డైరెక్టర్ సంగు గంగాధర్, కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మారుతి,3వ వార్డు కౌన్సిలర్ బత్తుల నరేష్ కల్లెడ గంగాధర్,ఎల్కా కమలాకర్,సమీర్ సర్కార్ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

