Thursday, February 26, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్అమరావతిలో పవిత్ర హారతిపై టిటిడి ఈవో సమీక్ష

అమరావతిలో పవిత్ర హారతిపై టిటిడి ఈవో సమీక్ష

📰 Generate e-Paper Clip

నవగీతం,తిరుపతి

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అమరావతిలో పవిత్ర హారతులు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని టిటిడి ఈవో  అనిల్ కుమార్ సింఘాల్ అధికారులకు సూచించారు. టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో టిటిడి ఉన్నతాధికారులతో ఈవో సోమవారం సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ గంగా నది తీరంలోని కాశీలో, ఉజ్జయినిలో నిర్వహిస్తున్న పవిత్ర హారతులతో పాటు ఇతర ప్రాంతాలలో ఎక్కడెక్కడ పవిత్ర హారతులు ఇస్తున్నారో టిటిడి అధికారుల కమిటీ పరిశీలించి నివేదిక రూపొందించాలని కోరారు. వేద మంత్రోచ్ఛారణలు, దీపాల కాంతులు, ఘంటానాదాల మధ్య పవిత్ర హారతి కార్యక్రమం భక్తులకు మరింత దైవనానుభూతిని పెంచుతుందని, టిటిడి అధికారుల కమిటీ లోతుగా అధ్యయనం చేసి సమగ్ర నివేదిక రూపొందించాలన్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల రాజధానులలో టిటిడి శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు ఆయా చీఫ్ సెక్రటరీలకు ఉత్తరాలు రాశామని, సదరు అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. గౌహతి, బెల్గాం ప్రాంతాలలో భూ కేటాయింపులపై సంబంధిత అధికారులతో చర్చించాలన్నారు.ఈ నెలాఖరులో వేదపారాయణ దారులకు, పోటు వర్కర్లకు వేర్వేరుగా శిక్షణ ఇచ్చేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు టిటిడిలోని 59 అనుబంధ, స్థానిక ఆలయాలలో 1004 సిసి కెమెరాలు ఏర్పాటు చేయగా, ఇప్పటికే 794 కెమెరాలు కార్యరూపంలో ఉన్నాయని, మిగిలిన చోట్ల సిసి కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా, స్థానిక, అనుబంధ ఆలయాలలో అన్నప్రసాద వితరణ చేసే దాతల పేర్లు ఎల్.ఈ.డీ స్క్రీన్ లలో డిస్ ప్లే అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి అవసరమైన భూమి కొరకు ఆయా జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలన్నారు. అదేవిధంగా విద్యా శాఖ, వైద్య , న్యాయ శాఖ , ఫారెస్ట్ , ఇంజనీరింగ్ విభాగాల లో జరుగుతున్న కార్యక్రమాలను ఆయన సమీక్షించారు ఈ కార్యక్రమంలో టిటిడి జేఈవో వి. వీరబ్రహ్మం, సివిఎస్వో  కే.వి. మురళీకృష్ణ, ఎఫ్.ఏ.అండ్ సీఏవో  ఓ. బాలాజీ, సీఈ టి.వి. సత్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular