నవగీతం, నిర్మల్
ఈ నెల 19 నుంచి 23 వరకు నిర్వహించనున్న నిర్మల్ ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లను వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఉత్సవాల నిర్వహణపై సమీక్షించారు.గత సంవత్సరం నిర్మల్ ఉత్సవాలకు మంచి గుర్తింపు లభించిందని తెలిపారు. ఈసారి కూడా అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. ఎన్టీఆర్ మినీ స్టేడియం సిద్ధం చేయడం, సుందరీకరణ, మరుగుదొడ్లు, లైటింగ్, పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని తెలిపారు. విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, విస్తృత ప్రచారం కల్పించాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో డీఈఓ భోజన్న, డీవైఎస్‌ఓ శ్రీకాంత్ రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ నర్సయ్య, డీపీఆర్వో విష్ణువర్ధన్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, ఈడీఎం నదీమ్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

