Thursday, September 24, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలన్యాయవాది కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం

న్యాయవాది కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం

📰 Generate e-Paper Clip

నవగీతం,మెట్ పల్లి

మెట్ పల్లి బార్ అసోసియేషన్ సభ్యులు గోరుమంతుల ప్రభాకర్ ఇటీవల మరణించగా, వారి కుటుంబ సభ్యుల సహాయార్థం మెట్ పల్లి , కోరుట్ల బార్ అసోసియేషన్ సభ్యుల సహకారంతో సమీకరించిన ఆర్థిక సహాయ నిధులను శుక్రవారం వారి కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్బంగా మెట్ పల్లి, కోరుట్ల బార్ అసోసియేషన్ల అధ్యక్షులు కంతి మోహన్ రెడ్డి, బైరి విజయ్ కుమార్ లు మాట్లాడుతూ, మరణించిన న్యాయవాది కుటుంబ సభ్యులకు ఆర్థికంగా అండగా ఉండేందుకు మెట్ పల్లి న్యాయవాదులు, రూ.1,60,000 -కోరుట్ల న్యాయవాదులు రూ.77, 500 మొత్తం రూ. 2,37,500/- సేకరించి బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమం లో మెట్ పల్లి బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు తోగిటి రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి పసునూరి శ్రీనివాస్, మహిళా ప్రతినిధి ఆకుల మానస, క్రీడా కార్యదర్సులు బిగుల్లా శంకర్, సుతారి నవీన్ కుమార్, కార్యవర్గ సభ్యులు కట్టా నర్సాగౌడ్, మన్నె గంగాధర్, గజభీంకర్ వెంకటేష్, ఊరడి నరేందర్, రాసభక్తుల రాజశేఖర్, న్యాయవాదులు బర్ల సంతోష్, వంగల శ్రీనివాస్ ఉన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular