Friday, April 17, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలఅంబరాన్ని తాకిన ముందస్తు సంక్రాంతి సంబరాలు

అంబరాన్ని తాకిన ముందస్తు సంక్రాంతి సంబరాలు

📰 Generate e-Paper Clip

నవగీతం, కోరుట్ల

కోరుట్ల పట్టణం లోని సాయి జీనియస్ హైస్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబురాలు శుక్రవారం అంబరాన్ని తాకాయి. ఈ సందర్బంగా సాయి జీనియస్ హైస్కూల్ కరస్పాండెంట్ చౌకి రమేష్ మాట్లాడుతూ భారతీయ సాంప్రదాయంలో సంక్రాoతి ఒక ముఖ్యమైన పండుగని సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సమయం లో సంక్రాంతి పండగ పర్వదినo జరుపుకొని ఇళ్ల ముందు కల్లాపి జల్లి గొబ్బేమ్మ లతో వాకిళ్ళు అలంకరించి హరిదాసుల, గంగి రెద్దుల విన్యాసాలతో పండుగ వాతావరణం సంతరించుకొంటుంద ని, పతంగుల పోటీల నిర్వహిస్తారు. పతంగులకు ఉపయోగించే మాంజా ధారమును ప్రభుత్వం నిషేధించింది దీని ద్వారా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని మాంజా ద్వారమును ఎవరు ఉపయోగించకూడదఅన్నారు. అనంతరం విద్యార్థులు భోగి మంటలు వేసి రక రకాల ముగ్గులు వేసి పాఠశాల లో సంక్రాంతి శోభ ను నింపారు. విద్యార్థులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ చౌకి సుధా, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular