Thursday, April 16, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలమల్యాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా కొండూరి రాజేష్

మల్యాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా కొండూరి రాజేష్

📰 Generate e-Paper Clip

నవగీతం,కొడిమ్యాల

జగిత్యాల జిల్లా మల్యాల–కొడిమ్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా కొడిమ్యాల పట్టణానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకుడు కొండూరి రాజేష్ ను అధికారికంగా నియమించారు. గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తూ, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న రాజేష్‌కు ఈ అవకాశం కల్పించడంపై మండల కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం కీలక పాత్ర పోషించినట్లు వారు పేర్కొన్నారు.ఈ సందర్భంగా కొండూరి రాజేష్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు, రైతులు, గ్రామ ప్రజల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తానని ఆయన తెలిపారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular