నవగీతం, మెట్ పల్లి
సిట్ విచారణ అనంతరం తెలంగాణ భవన్ కు చేరుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కి సంఘీభావం తెలిపి అనంతరం బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయ కక్షతో మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పై తప్పుడు కేసులు బనాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అని అన్నారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి పస లేదని సుప్రీంకోర్టే స్పష్టంగా పేర్కొని కేసును కొట్టివేసినప్పటికీ, మళ్లీ హరీష్ రావు కి నోటీసులు జారీ చేసి విచారించడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ రాజకీయ కక్షపూరిత దురుద్దేశానికి నిదర్శనం. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న హరీష్ రావు ని రాజకీయంగా ఎదుర్కోలేక, తప్పుడు కేసులతో వేధిస్తున్నారని,ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నోటీసులు ఇచ్చినా ప్రజల పక్షాన బిఆర్ఎస్ పోరాటం ఆగదు అని అన్నారు.

