Thursday, February 26, 2026
ads
Homeజిల్లా వార్తలుహైదరాబాద్మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

📰 Generate e-Paper Clip

నవగీతం, హైదరాబాద్

రాష్ట్రంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలు జూనియర్ కళాశాలలో ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ తెలిపారు. 5వ తరగతి,ఇంటర్మీడియట్ ఫస్టియర్ తో పాటు 6,7,8 తరగతుల్లో బ్యాక్ లాగ్ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.మొత్తం 205 గురుకులాల్లో 107 బాలురకు, 98 బాలికల కోసం ఉన్నాయని,వీటిలో 75 శాతం సీట్లు మైనార్టీలకు ఇతర విద్యార్థులకు 25 శాతం సీట్లు మైనార్టీయేతర విద్యార్థులకు రిజర్వు చేశామని వివరించారు. https://tgmreistelangan.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేయాలని దరఖాస్తు గడువు ఫిబ్రవరి 28 తో ముగుస్తుందని వెల్లడించారు. మైనారిటీ విద్యార్థులకు తొలుత దరఖాస్తు చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుందని, మైనార్టీయేతర విద్యార్థులకు లక్కీ డీప్ ద్వారా సీట్లను కేటాయిస్తామన్నారు. ఇంటర్లో 10వ తరగతి పరీక్షల్లో వచ్చిన మార్కులు సి ఓ ఈ లలో ప్రవేశానికి ప్రవేశ పరీక్ష,మౌఖిక పరీక్షలు ఉంటాయన్నారు.ఐదో తరగతి, పాఠశాలల్లో బ్యాక్ లాగ్ ఖాళీలకు విద్యార్థుల ఎంపిక ఏప్రిల్ 24 నుంచి 30 వరకు ఉంటుందని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular