నవగీతం,వైరా
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వైరా మున్సిపాలిటీలో బలమున్న వార్డులలో సిపిఐ పోటీ చేస్తుందని సిపిఐ వైరా నియోజకవర్గ ఇన్చార్జి యార్రబాబు అన్నారు బుధవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో మాచర్ల నాగభూషణం అధ్యక్షతన జరిగిన మున్సిపాలిటీ కార్యవర్గ కౌన్సిల్ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ మున్సిపాలిటీ ఎన్నికలలో కలిసివచ్చే రాజకీయ పార్టీలతో కలిసి ఎన్నికలలో పోటీ చేసి సత్తా చాటాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు బలమున్న వార్డులలో ఎన్నికల పొత్తులు కుదరని పక్షంలో ఒంటరిగానైనా పోటీ చేయటానికి సిద్ధంగా ఉండాలని సమావేశంలో పాల్గొన్న పలువురు కార్యకర్తలు అభిప్రాయపడ్డారు ఇప్పటినుండి ఆయా వార్డులలో వార్డు సమావేశాలు నిర్వహించుకొని స్థానిక రిజర్వేషన్ల ప్రకారం పోటీకి అభ్యర్థులను నిర్ణయించుకొని ఎన్నికలకు సమాయత్తం కావాలని నిర్ణయించారు ఈ సమావేశంలో సిపిఐ వైరా మండల కార్యదర్శి యామాల గోపాలరావు పాల్గొని మాట్లాడుతూ వైరా పట్టణంలో మున్సిపాలిటీ కార్మికులు ఆటో కార్మికులు ఇతర పేద వర్గాల కోసం కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో వాళ్ల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం జరిగిందని భవిష్యత్తులో కూడా కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడూ కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటుందని తెలిపారు. మున్సిపాలిటీలో సిపిఐ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ఆదరించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో వైరా పట్టణ కార్యదర్శి మిట్టపల్లి రాఘవరావు సహాయ కార్యదర్శి మూటకొండ దుద్దుపూడి వార్డు కార్యదర్శి అమర్లపూడి అనిల్ ఏఐటియుసి కార్యదర్శి గారపాటి అశోక్ రైతు సంఘం కార్యదర్శి కొండ రామకృష్ణపల్లిపాడు వార్డు కార్యదర్శి పరిటాల వీరయ్య అమర్లపూడి అఖిల్ గుజర్లపూడి రామయ్య తంబళ్ల భాస్కర్ తెల్లబోయిన వెంకటేశ్వర్లు ఎస్కే షరీఫ్ గురుమూర్తి మోరు శ్రీనివాసరావు రాయి రవి చింతపల్లి గోపాలరావు తదితరులు పాల్గొన్నారు

