నవగీతం, మల్లాపూర్
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 20 నుండి 26 వరకు వారం రోజులపాటు జంతు గణన ఏ.ఐ.టి.ఈ (All India Tiger Estimate-2026) కార్యక్రమంలో భాగంగా మల్లాపూర్ మండలం పరిసర ప్రాంత అడవిలో ఉన్న వన్యప్రాణుల, జంతువుల యొక్క గణన సర్వే చేయబడుతుంది. ఈ సర్వేలో భాగంగా అటవీ ప్రాంతంలో ఉండే శాఖాహార మరియు మాంసాహార జంతువుల సర్వే ప్రత్యేకమైన మొబైల్ యాప్ లో నిక్షిప్తం చేయబడుతుంది, ఇప్పటికే ప్రారంభమైన సర్వే వారం రోజులపాటు కొనసాగుతుంది. జంతువుల యొక్క గణన ప్రత్యేకమైన మొబైల్ యాప్ లో నిక్షిప్తం చేయబడుతుంది, ఈ సర్వే ద్వారా సేకరించే నటువంటి డేటా పులులు అలాగే వన్యప్రాణుల సంరక్షణకు అటవీ శాఖ అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో కోరుట్ల సెక్షన్ లో గల కోరుట్ల బీట్ లో మరియు రేగుంట బీటులో జంతువుల లెక్కింపు కార్యక్రమం కొనసాగుతుంది దీనిలో భాగంగా మెట్పల్లి రేంజ్ అధికారి పి.పద్మారావు, కోరుట్ల డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ వి.సురేష్ కుమార్ బీట్ ఆఫీసర్ రఫీ నయీమ్ పాల్గొన్నారు

