Saturday, March 7, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుఅభివృద్ధిలో విప్పలమడక పంచాయితీ ఆదర్శం

అభివృద్ధిలో విప్పలమడక పంచాయితీ ఆదర్శం

📰 Generate e-Paper Clip

మేడా శంకరయ్య- సుశీలమ్మ చారిటబుల్ ట్రస్ట్ సేవలు బేస్

వైరా ఎస్ఐ పుష్పాల రామారావు

నవగీతం, వైరా:

వైరా మండలంలోని విప్పలమడక గ్రామ పంచాయితీ అభివృద్ధి కార్యక్రమాల్లో జిల్లాకే ఆదర్శంగా నిలుస్తుందని వైరా ఎస్ఐ పుష్పాల రామారావు అన్నారు. విప్పలమడక గ్రామంలో మేడా శంకరయ్య – సుశీలమ్మ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని కొనియాడారు. మేడా శంకరయ్య – సుశీలమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామపంచాయితీ కార్యాలయంలో  సుమారు లక్ష రూపాయలతో ఏర్పాటు చేసిన కంప్యూటర్, సీసీ కెమెరాలు, ఇన్వర్టర్, వాటర్ ప్యూరిఫైయర్ లను  సోమవారం ఎస్ఐ రామారావు ప్రారంభించారు. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు రూ.75 వేలతో ఇప్పటికే గ్రామంలో 100 వాట్స్ ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా మన్నెం నాగేశ్వరరావు(పాలెం) జ్ఞాపకార్థం వారి కుమారులు  పంచాయతీ కార్యాలయానికి 30 వేల రూపాయల  కంప్యూటర్ ను, ఇమ్మడి పెద్ద వెంకయ్య జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు రూ.12 వేల విలువచేసే వాటర్ ప్యూరిఫైయర్ ను, వైరాకు చెందిన వ్యాపారి కొప్పుల వెంకట అప్పారావు రూ.20వేల విలువ గల  సీసీ కెమెరాలను, వైరాకు చెందిన కాంగ్రెస్ జిల్లా నాయకులు పణితి సైదులు రూ.20 వేలు విలువచేసే ఇన్వర్టర్ ను అందజేశారు. గ్రామ పంచాయితీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఈ సౌకర్యాలను  ఎస్సై రామారావు ప్రారంభించి ప్రసంగించారు. నెల రోజుల వ్యవధిలోనే రూ. 1.57 లక్షల రూపాయలతో ట్రస్ట్ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించటం అభినందనీయమన్నారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా  గ్రామపంచాయితీ కార్యాలయానికి సౌకర్యాలు కల్పించారని చెప్పారు.భవిష్యత్తులో మేడా శంకరయ్య – సుశీలమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని ఆకాంక్షించారు. విప్పలమడక గ్రామ పంచాయితీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేడా హేమిమా చక్రపాణి, ఉప సర్పంచ్ బూర్గు లూర్థమ్మ, మాజీ సర్పంచ్ తుమ్మల జాన్ పాపయ్య, మాజీ ఎంపీటీసీ ఆకుల ప్రసాద్, గ్రామ కార్యదర్శి కాంపెల్లి ధనమ్మ, నీటి సంఘం మాజీ అధ్యక్షులు కొల్లా వెంకటేశ్వరరావు, మాజీ ఉపసర్పంచ్లు కొల్లికొండ వీరభద్రరావు, వీరపనేని చెన్నకేశవరావు, సొసైటీ మాజీ డైరెక్టర్ దేవభక్తిని అర్జున్ రావు, టిడిపి గ్రామ అధ్యక్షుడు మేడా సూర్యనారాయణ, నాయకులు దేవభక్తిని సాంబశివరావు, గోసు కృష్ణయ్య, మోతుపల్లి రామారావు, లింగాల వెంకటేశ్వర్లు, వార్డు సభ్యులు ముత్తమాల నాగజ్యోతి, పారుపల్లి నిఖిత, గరిడేపల్లి శ్రీనివాసరావు, కాశీమాల సామేలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular