నవగీతం, పెద్దపల్లి:
పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన గీత కార్మికుడు బూరుగు సదయ్య గౌడ్ నాలుగు రోజుల క్రితం తాడిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారిపడి మరణించిన విషయం తెలిసిందే.ఈ విషయం తెలుసుకున్న బీసీ జేఏసీ పెద్దపల్లి జిల్లా చైర్మన్ దాసరి ఉష మంగళవారం అప్పన్నపేట గ్రామానికి వెళ్లి సదయ్య గౌడ్ కుటుంబాన్ని పరామర్శించారు. మృతుడి భార్య కవిత, కుమారులు సందీప్,శ్రీనాథ్‌లను ఆమె ఓదార్చి,వారికి ధైర్యం చెప్పారు.ఒక పేద గీత కార్మిక కుటుంబానికి జరిగిన ఈ నష్టం పూడ్చలేనిదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.కుల వృత్తినే నమ్ముకుని జీవించే గౌడ సోదరులకు ప్రభుత్వం నుండి పూర్తి స్థాయిలో రక్షణ మరియు బీమా సౌకర్యాలు అందాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.బాధితుడి కుటుంబానికి బీసీ జేఏసీ అన్ని విధాలా అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు బొబ్బిలి లింగయ్య గౌడ్,మిట్టపల్లి శ్రీహరి,లక్మన్, రాజేశం,రాములు,ఎల్లేష్,కొండి సతీష్,మెరుగు సాగర్,కన్నం శ్రావణ్,తదితరులు
పాల్గోన్నారు.

