Monday, March 2, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలఎన్నికలు సజువుగా జరిగేలా సహకరించాలి

ఎన్నికలు సజువుగా జరిగేలా సహకరించాలి

📰 Generate e-Paper Clip

జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, అడిషనల్ ఎస్పీ శేషాద్రిని రెడ్డి

నవగీతం,జగిత్యాల:

జగిత్యాల జిల్లాలో 5 మున్సిపాలిటీలో నిర్వహించనున్న ఎన్నికలకు అధికారులు, రాజకీయ పార్టీలు, మీడియా మరియు ప్రజలు ఎన్నికలు సజావుగా సాగేలా సహకరించాలని తెలిపారు.ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలోని 5 మున్సిపాలిటీల పరిధిలోని 136 వార్డులకు ఎన్నికలు జరుగుతాయని తెలిపారు.   వివరాలు: జగిత్యాల మున్సిపల్ – 50 ధర్మపురి – 15,రాయికల్ – 12,కోరుట్ల – 33,  మెట్ పల్లి – 26 ,ఇందుకుగాను మొత్తం 379 పోలింగ్ స్టేషన్ లు ఏర్పాటు చేశామని అలాగే అవసరం మేరకు పోలింగ్ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉన్నారని తెలిపారు. జిల్లాలోని 5 మున్సిపాలిటీలో జరగబోయే రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలకు అందరు సహకరించి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ కోరారు. అడిషనల్ ఎస్పీ శేషాద్రిని రెడ్డి మాట్లాడుతూ రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలకు అన్ని రకాలుగా పోలీస్ బందోబస్త్ చేశామని ఎన్నికలు విజయవంతం అయ్యేలా పోలీసు సిబ్బందికి అందరు సహకరించాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular