నవగీతం,రుద్రంగి:
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో లోవోల్టేజీ సమస్యను అధిగమించేందుకు బ్రేకర్ ఏర్పాటు గాను రూ. 4 లక్షల 72 వేలు మంజూరు కాగా అట్టి నిర్మాణపు పనులు చేపట్టగా ఏఎంసీ చెర్మెన్ చెలుకల తిరుపతి, సర్పంచ్ గండి నారాయణ తోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు బుధవారం పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో రుద్రంగి గ్రామానికి లోవోల్టేజి సమస్య ఎక్కువ ఉండేదని, గ్రామంలో ఎక్కడైన చిన్న విద్యూత్ ఏర్పడితే మొత్తం కరెంటు నిలిపివేసి మరమ్మత్తులు చేపట్టేదని, దీంతో వ్యవసాయ రంగానికి సమస్యగా మారిందని, ప్రస్తుతం వేసవి కాలం దృష్టిలో పెట్టుకొని లోవోల్టేజి సమస్యను తీర్చాలని విద్యుత్ అధికారులకు, విప్ ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగిందని, అడిగిన నెల రోజుల లోపలనే నిధులు మంజూరు కాబడి బ్రెకర్ నిర్మాణపు పనులు చేపట్టడం జరిగిందన్నరు. ఇది పూర్తైతే రుద్రంగి గ్రామానికి లోవోల్టేజి సమస్య తీరుందని అన్నారు. ఇది రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడానికి ఇదోక నిదర్శనం అన్నారు. నిధులు మంజూరు చేసిన బట్టి విక్రమార్క కు, కృషి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.

