సీఎం కప్ మండల స్థాయి క్రీడోత్సవాలు ప్రారంభం
నవగీతం,మల్లాపూర్:
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో సీఎం కప్ మండల స్థాయి బాలికల క్రీడోత్సవాలు మండల విద్యాధికారి కేతిరి దామోదర్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు ప్రాముఖ్యత నివ్వాలని క్రీడలతో శారీరక , మానసిక వికాసం పెంపొందుతుందని , శారీరిక దృడత్వం పెరుగుతుందని తెలిపారు.

నియాజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి మండలానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు చంద్రమోహన్ రెడ్డి , ఎస్జిఎఫ్ కార్యదర్శి చంద్రకళ వ్యాయమ ఉపాధ్యాయులు రాజశేఖర్ , వినోద్ , విక్రమ్, కవిత పాల్గొన్నారు

