Thursday, February 26, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలట్రాఫిక్ నియమాలు పాటిద్దాం.. రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం: అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి

ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం.. రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం: అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి

📰 Generate e-Paper Clip

రోడ్డు భద్రత అవగాహనపై  హెల్మెట్ అవగాహన బైక్ ర్యాలీ ప్రారంభించిన అదనపు ఎస్పీ

నవగీతం,జగిత్యాల:

ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించి, వాహనాల వేగాన్ని నియంత్రించినప్పుడే రోడ్డు ప్రమాదాలను నివారించడం సాధ్యమని జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి అన్నారు.రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం జగిత్యాల పట్టణంలోని ఆర్‌డీఓ చౌరస్తాలో, పోలీస్ శాఖ, లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రాఫిక్ నియమాలు, హెల్మెట్ వినియోగంపై అవగాహన బైక్ ర్యాలీని అదనపు ఎస్పీ  జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలలో ప్రాణ నష్టాలను గణనీయంగా తగ్గించాలనే లక్ష్యంతో రాష్ట్ర డీజీపీ, జిల్లా ఎస్పి  ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “Arrive Alive – A Campaign for Safer Roads in Telangana” అనే ప్రత్యేక రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.

.ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ప్రజలు రోడ్డు ప్రయాణం సమయంలో సురక్షితంగా తమ గమ్యాన్ని చేరుకోవడం, డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని అలవాటు చేసుకోవడమని పేర్కొన్నారు. వాహనాలను తక్కువ వేగంతో నడపడం, ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించడమే రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రధాన మార్గమని సూచించారు.రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ శాతం ద్విచక్ర వాహనదారులే ప్రాణాలు కోల్పోతున్నారని, దీనికి ప్రధాన కారణం హెల్మెట్ ధరించకపోవడమేనని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు.ఈ అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం పెరిగి ప్రమాదాలు కొంత మేరకైనా తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటించి పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.

ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 100 హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.అనంతరం ఆర్డీఓ కూడలి నుండి కొత్త బస్టాండ్ వరకు హెల్మెట్ ర్యాలీ నిర్వహించి, ప్రజల్లో రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ రఘు చందర్, టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్,  డిటిఓ శ్రీనివాస్, ట్రాఫిక్ ఎస్‌.ఐ మల్లేశం,య విఐ వెంకన్న, ఏయంవి ఐ అభిలాష్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular