Thursday, February 26, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలటెట్ రద్దు కై చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరణ

టెట్ రద్దు కై చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

నవగీతం,జగిత్యాల:

ఎఐజాక్టో పిలుపు మేరకు పి.ఆర్.టి.యు.టి.ఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోయినిపెల్లి ఆనంద్ రావు, యాల్ల అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5 న సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలని కోరుతూ “చలో ఢిల్లీ’ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్య హక్కు చట్టం 2009 లోని సెక్షన్ 23 ను సవరించి2010 కి ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలని వారు కోరారు. ఈ సందర్భంగా ధర్నాకు అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొనాలని వారు కోరారు.ఈ కార్యక్రమములో పంచాయతీరాజ్ ఉపాధ్యాయ మాసపత్రిక సంపాదకవర్గ సభ్యులు ఎ వి న్ రాజు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు బాసిత్, రాష్ట్ర కార్యదర్శి అనూజ, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీదేవి, బాధ్యులు హరీష్, ఆత్మ చరణ్ రావు, అనిల్ రావు, శ్రీనివాస్, రాజశేఖర్, గంగారెడ్డి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular