Thursday, February 26, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలశ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు భక్తుల విశేష స్పందన

శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు భక్తుల విశేష స్పందన

📰 Generate e-Paper Clip

హుండీల ద్వారా భారీగా వచ్చిన జాతర ఆదాయం.

నవగీతం,కోడిమ్యాల:

కొడిమ్యాల మండలం నల్లగొండ గ్రామంలో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించబడ్డాయి. ఐదు రోజుల పాటు సాగిన స్వామివారి బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, మొక్కులు చెల్లించారు.బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం శ్రీ స్వామివారి హుండీలను ఆలయ అధికారులు భక్తుల సమక్షంలో విప్పగా భక్తుల అపారమైన భక్తిని ప్రతిబింబించేలా విశేష ఆదాయం లభించింది. హుండీల ద్వారా మొత్తం రూ. 9,12,751/- నగదు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అదేవిధంగా మిశ్రమ బంగారం – 29 గ్రాములు మిశ్రమ వెండి – 1 కిలో 300 గ్రాములు సేకరించబడినట్లు తెలిపారు.

అలాగే వివిధ దర్శన, సేవా టికెట్ల ద్వారా రూ. 4,00,599/-, టెండర్ల ద్వారా రూ. 3,74,000/- ఆదాయం లభించింది. వీటన్నింటిని కలిపి జాతర ద్వారా మొత్తం రూ. 13,13,350/- ఆదాయం వచ్చినట్లు, టెండర్లతో కలిపి మొత్తం ఆదాయం రూ. 16,87,350/-కు వచ్చినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ జగిత్యాల డివిజన్ పరిశీలకులు ఎం. రాజమౌళి, కోడిమ్యాల పోలీస్ అధికారులు, ఆలయ అర్చకులు, సిబ్బంది,భక్తులు, అన్నమయ్య సేవవారు పాల్గొని కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించారు.అలాగే ఆలయ కార్యనిర్వాహణాధికారి ఉడుత. వెంకన్న ప్రత్యేక పర్యవేక్షణ వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి కల్యాణం, వాహన సేవలు, ప్రత్యేక అభిషేకాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular