నవగీతం, మెట్ పల్లి:
మెట్ పల్లి మండలం వేంపేట్ గ్రామంలో సర్పంచ్ గోరుమంతుల ప్రవీణ్ కుమార్, పాలకవర్గం గత నెల 23 తేది నుండి ప్రతీరోజూ 15 మంది ప్రత్యేక పారిశుద్ధ కార్మికులతో డ్రైనేజి లను శుభ్రం చేయిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా సర్పంచ్ గ్రామపంచాయతీ పాలకవర్గం వార్డులన్నీ తిరుగుతూ గ్రామ ప్రజలందరూ దయచేసి డ్రైనేజి లో చెత్త, మరియు మిగిలిన ఆహార పదార్థాలను వేయకండి అని ఇంటింటికి గ్రామపంచాయతీ వాహనం వచ్చేటప్పుడు ఆ వాహనంలో చెత్తను వేయాలని వీధులన్నీ శుభ్రంగా ఉంచుకోవాలని అది మనందరి బాధ్యత అని అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ 4 వ వార్డు మెంబర్ చంద్రచారి దశకంఠ రాజు పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

