బాబా సాహెబ్ ఆశయాల స్మరణ
నవగీతం , కోరుట్ల ప్రతినిధి :
కోరుట్ల పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణారావు మున్సిపల్ కమిషనర్ , మున్సిపల్ చైర్మన్ తిరుమల వసంత గంగాధర్ మరియు కౌన్సిలర్ తెడ్డు శ్రీజ విజయ్ హాజరై, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ ..దేశానికి సమానత్వం, న్యాయం, మరియు స్వేచ్ఛ వంటి అత్యున్నత విలువలను ప్రసాదించిన మహనీయుడు అంబేద్కర్ అని, ఆయన రచించిన రాజ్యాంగం నేడు ప్రతి పౌరుడికి హక్కుల రక్షణ కవచంగా నిలిచిందని కొనియాడారు. ముఖ్యంగా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన నిరంతర కృషి చిరస్మరణీయమని, ఆయన ఆశయ సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు మరియు స్థానిక ప్రజలు పాల్గొని బాబాసాహెబ్‌కు ఘన నివాళులు అర్పించారు.

