Thursday, February 26, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలచదువుకో తెలంగాణ- బాగా చదవండి మిషన్ 10వ తరగతి పోస్టర్ ఆవిష్కరణ

చదువుకో తెలంగాణ- బాగా చదవండి మిషన్ 10వ తరగతి పోస్టర్ ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

నేటి బాలలే రేపటి పౌరులు

– బ్రాంచ్ మేనేజర్ పోతుగంటి నరేష్

నవగీతం,మల్లాపూర్:

శ్రీ రామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో చేపట్టిన “చదువుకో తెలంగాణ – బాగా చదవండి-మిషన్ 10వ తరగతి” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను మల్లాపూర్ మండల విద్యాశాఖ అధికారి ఎంఈఓ కేతిరి దామోదర్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ మెట్‌పల్లి బ్రాంచ్ మేనేజర్ పోతుగంటి నరేష్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ప్రతిభా పురస్కారాల కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 10వ తరగతి విద్యార్థులకు మొత్తం రూ.2.2 కోట్ల విలువైన నగదు బహుమతులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిల్లో టాపర్‌గా నిలిచిన విద్యార్థులకు వివిధ స్థాయిల్లో బహుమతులు అందజేయబడతాయని వివరించారు.ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మల్లాపూర్ జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు చంద్రమోహన్ రెడ్డి, వివి రావుపేట జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు జలపతి రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ప్రతిభా పురస్కారాలు సాధించాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో వేంపల్లి సర్పంచ్ రాజేందర్, వెంకట్రావుపేట సర్పంచ్ కనుముల వెంకటేష్, నాయకులు బిట్ల నరేష్, మినుగు చంద్రశేఖర్, శ్రీరామ్ లైఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్స్ కొడిమ్యాల రాజేందర్, నిమిషకవి రాజేష్, ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు జలపతి రెడ్డి, శ్రీనివాస్, రాజశేఖర్, ఐయుష్, వెంకటరమణ, రాజమల్లయ్య, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular