నవగీతం,కొడిమ్యల:
కొడిమ్యాల మండలం కోరుటపల్లి గ్రామంలో గత వారంలో అకాలమరణం చెందిన వృద్ధ దంపతుల కుటుంబాన్ని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి పరామర్శించారు. కోరుటపల్లి గ్రామానికి చెందిన మేకల సుందర్ రెడ్డి, మేకల మునమ్మ దంపతులు గంటల వ్యవధిలో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఆయన, గురువారం వారి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా మేకల రామ్మోహన్ రెడ్డి కుటుంబానికి ధైర్యం చెప్పి, ఈ దుఃఖ సమయంలో తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఆయన వెంట బీజేపీ మాజీ మండలాధ్యక్షులు ప్రకాశ్ రెడ్డి, కరీంనగర్ మున్సిపల్ మాజీ కార్పొరేటర్ నేలకొండ నారాయణరావు, బీజేవైఎం మాజీ జిల్లా అధ్యక్షులు గంటా రమణారెడ్డి,బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కట్ట రవీందర్, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి జిట్టవేణి అంజిబాబు, మాజీ మండల అధ్యక్షులు ఎడవల్లి లక్ష్మీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

