Wednesday, April 22, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలమున్సిపల్ చైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన కో-ఆప్షన్ సభ్యులు

మున్సిపల్ చైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన కో-ఆప్షన్ సభ్యులు

📰 Generate e-Paper Clip

నవగీతం, కోరుట్ల ప్రతినిధి:

కోరుట్ల మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన 27వ వార్డు మాజీ కౌన్సిలర్ గుండోజి శ్రీనివాస్ మరియు బొద్దూరి సతీష్‌లు మంగళవారం సాయంత్రం మున్సిపల్ చైర్మన్ తిరుమల వసంత గంగాధర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..తమ ఎన్నికకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు, సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణరావులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడంతో పాటు మున్సిపల్ చైర్మన్ తిరుమల వసంత గంగాధర్ ను , మున్సిపల్ వైస్ చైర్మన్ షాహిద్, మాజీ చైర్మన్ అన్నం లావణ్య అనిల్, పట్టణ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు మరియు పాత్రికేయ మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు ప్రకటించారు. తమపై నమ్మకం ఉంచి అప్పగించిన ఈ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తూ పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో శంకర వరప్రసాద్ ,నాగేశ్వర వర ప్రసాద్ ,సత్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

కో ఆప్షన్ సభ్యులు గుండోజి శ్రీనివాస్ ను సన్మానించిన విశ్వ బ్రాహ్మణ సంఘ సభ్యులు

కోరుట్ల మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యునిగా ఎన్నికైన 27వ వార్డు మాజీ కౌన్సిలర్ గుండోజి శ్రీనివాస్‌ను బుధవారం ఉదయం స్థానిక విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
సంఘం అధ్యక్షులు మండలోజు పవన్ మరియు కార్యవర్గం నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీనివాస్‌ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ.. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే శ్రీనివాస్‌కు ఈ గౌరవం దక్కడం గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో  ఈశ్వర ప్రసాద్ , సత్య ప్రసాద్, సత్యం ,మనోహర్ , ప్రభాకర్ , శేఖర్ , ప్రసాద్ తదితరులు పాల్గొని తమ సంఘం తరపున పూర్తి మద్దతు ప్రకటించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular