Wednesday, April 22, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలకొండగట్టు ఈవోకు వినతిపత్రం అందజేసిన ఆర్టీఐ జిల్లా అధ్యక్షులు

కొండగట్టు ఈవోకు వినతిపత్రం అందజేసిన ఆర్టీఐ జిల్లా అధ్యక్షులు

📰 Generate e-Paper Clip

నవగీతం, కొడిమ్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం భక్తులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీఐ జిల్లా అధ్యక్షులు అక్కపెల్లి రవీందర్ ఆలయ ఈవో అంజన రెడ్డికి వినతిపత్రం అందజేశారు.​భక్తుల సౌకర్యార్థం ఆలయ సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. వినతిపత్రంలో పేర్కొన్న ప్రధాన అంశాలు.వేసవి దృష్ట్యా ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీటి సదుపాయంతో పాటు చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలి.​గతంలో వేలం వేసిన దుకాణాల టెండర్లు ముగిసినప్పటికీ, కొందరు టెండర్ దారులు ఇంకా పాత అద్దెలకే కొనసాగుతున్నారని, గతంలో టెండర్ ద్వారా దక్కించుకున్న దుకాణదారులు అద్దెలు చెల్లించని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.అదేవిధంగా, భక్తుల నుంచి వస్తువులకు అధిక ధరలు వసూలు చేయకుండా కఠిన నియమాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.​భక్తులకు వసతి గదుల కేటాయింపులో పారదర్శకత ఉండాలని, అన్నదాన సత్రంలో భక్తులకు నాణ్యమైన భోజనం సక్రమంగా అందేలా ఈవో ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని కోరారు.​ఈ కార్యక్రమంలో ఆర్టీఐ బాధ్యులు స్థానికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular