నవగీతం,మెట్ పల్లి:
మహబూబ్ నగర్ జిల్లాలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ హాజరై జరిగిన ‘బీజేపీ విజయ సంకల్ప సమ్మేళన’ కార్యక్రమ ప్రత్యేక ప్రదర్శనను బుధవారం మెట్ పల్లిలో నిర్వహించారు. ఈ సందర్భంగా మెట్ పల్లి పట్టణంలోని మఠంవాడలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ఉపన్యాసం అందించారు.

ఈ కార్యక్రమానికి పట్టణంలోని అన్ని వార్డుల నుండి సుమారు 500 మంది పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొని ఉపన్యాసాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జీ అమ్దాపూర్ రాజేష్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పీసు రాజేందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఎర్ర లక్ష్మీ, పార్టీ మండల ఉపాధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి సుంకేట విజయ్ తదితరులు పాల్గొన్నారు.

