Thursday, February 26, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలజోరుగా బీజేపీ ఎన్నికల ప్రచారం.

జోరుగా బీజేపీ ఎన్నికల ప్రచారం.

📰 Generate e-Paper Clip

నవగీతం,మెట్ పల్లి:

మున్సిపల్ సాధారణ ఎన్నికల నేపథ్యంలో మెట్ పల్లి పట్టణంలోని అన్ని వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. నిన్నటి వరకు నామినేషన్ పత్రాల ఉపసంహరణ పూర్తికాగా రేసులో ఉన్న అభ్యర్థులను అధికారులు ప్రకటించారు. దీంతో బుధవారం రోజున పట్టణంలోని అన్ని వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ ప్రజలను ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఈనెల 11న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అప్పటిలోగా వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి ఓటును అభ్యర్థించడానికి ప్రత్యేక ప్రణాళిక ద్వారా ముందుకెళ్తున్నారు.

జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు, మెట్ పల్లి మున్సిపల్ బీజేపీ ఎన్నికల ఇంచార్జీ అమ్దాపూర్ రాజేష్ ల నేతృత్వంలో అభ్యర్థులు ఇంటింటా ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. మెట్ పల్లి మున్సిపల్ లో బీజేపీ జెండా ఎగరడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సైతం కృషి చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular