ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్
నవగీతం,వైరా ప్రతినిధి:
వైరా నియోజకవర్గ కేంద్రంలోని వైరా మున్సిపాలిటీలో ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ రాష్ట్ర హస్తకళల సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు మున్సిపాలిటీలోని ఐదు.ఆరు వార్డుల్లో కౌన్సిలర్ అభ్యర్థులు మిట్టపల్లి రాఘవరావు డాక్టర్ కాపా చంద్రకళ ను గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారని అన్నారు పట్టణ ప్రాంతాల అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు వెచ్చించి పట్టణాలను అభివృద్ధి చేస్తున్నారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని అన్నారు.

పేదలకు ఇందిరమ్మ ఇల్లు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రైతులకు రైతుబంధు రుణమాఫీ ఉచిత విద్యుత్తు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పలు సంక్షేమ పథకాలు అందించారని తెలిపారు ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు విస్తృత ప్రచారం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ పీసీసీ ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు జిల్లా కాంగ్రెస్ నాయకులు బొర్ర రాజశేఖర్ డాక్టర్ కాప మురళీకృష్ణ ములపాటి సీతారాములు ఎదునూరు సీతారాములు, ఉండ్రు శ్యాంబాబు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

