పి అర్ పి ఏ జిల్లా కన్వీనర్ యలమద్ది వెంకటేశ్వర్లు వైవి
నవగీతం తల్లాడ ప్రతినిధి
తల్లాడ మండలం లోని తెలగవరం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం హెల్పింగ్ హాండ్స్ సంస్థ నున్నా ప్రదీప్ రిటైర్డ్ టీచర్ కుమారుడు నున్నా సాత్విక్ ఎన్నారై అమ్మ నున్నా సుజాత జ్ఞాపకార్ధం పదిహేను వేల రూపాయల విలువైన అహుజా మైక్ సెట్ ను అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరైన నూతనకల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఏ. రమేష్,పి ఆర్ పి ఏ జిల్లా కన్వీనర్ యలమద్ది వెంకటేశ్వర్లు చేతులమీదుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేమిరెడ్డి అచ్చి రెడ్డి, ఉపాధ్యాయులు అద్దంకి గోపాల క్రిష్ణ లకు అందించారు.ఈ సందర్భంగా పిఆర్పీఏ జిల్లా కన్వీనర్ యలమద్ది వెంకటేశ్వర్లు వైవి మాట్లాడుతూ ఈ పాఠశాల అభివృద్ధి కోసం ఆవాస ప్రాంతంలోని పెద్దల సహకారంతో 7.గురు నూతన విద్యార్థుల అడ్మిషన్లు చేసిన పాఠశాల ఉపాధ్యాయులను అభినందించారు.అదేవిధంగా పాఠశాల అవసరాల నిమిత్తం ఆర్థిక సహకారం అందించిన నున్నా ప్రదీప్ -సుజాత దాతృత్వం గొప్ప అభినందనీయమని తెలిపారు.నూతనకల్ ప్రధానోపాధ్యాయులు ఏ రమేష్ మాట్లాడుతూ జిల్లాలో చాలా పాఠశాలలకు మౌలిక వసతులకు సమకూర్చటం లో యలమద్ది వెంకటేశ్వర్లు వైవి అభినందనీయుల ని ఉద్యోగ విరమణ పొందినప్పటికీ ఉపాధ్యాయుల కోసం, పాఠశాల కోసం అనునిత్యం కష్టపడుతున్నారని తెలిపారు .ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేమిరెడ్డి అచ్చి రెడ్డి, పిఆర్టియూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రాయల నరసింహ రావు, పిఆర్టియూ తల్లాడ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శ లు ఉంగరాల వెంకటేశ్వర్లు గారు, అద్దంకి గోపాల క్రిష్ణ ,గ్రామ సర్పంచ్ భూక్యా కాళోజి , ఉప సర్పంచ్ సిలివేరు నరసింహ రావు, డీలర్ తూము నరసింహ రావు, ఉపాధ్యాయులు ముదిగొండ తిరుపతి రావు, అనుమోలు రాఘవ రావు, నేలపట్ల మహేష్ పాల్గొన్నారు .

