Friday, September 18, 2026
ads
Homeఖమ్మం​ప్రాణదాతగా మారిన రోడ్డు ప్రమాద బాధితుడు

​ప్రాణదాతగా మారిన రోడ్డు ప్రమాద బాధితుడు

📰 Generate e-Paper Clip

వేలాది కుటుంబాలకు అండగా నిలుస్తున్న జాస్తిపల్లి చల్లా సాయికుమార్

నవగీతం ఖమ్మం ప్రతినిధి:

ఒక చిన్న ప్రమాదం అతని జీవితాన్నే మార్చేసింది. ఆనాడు తాను పడిన రక్తం కష్టాన్ని గుర్తుచేసుకుంటూ, నేడు వందలాది మంది తలసేమియా బాధితులకు, అత్యవసర రోగులకు ప్రాణదాతగా నిలుస్తున్నారు ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం జాస్తిపల్లి గ్రామానికి చెందిన యువకుడు చల్లా సాయికుమార్.ప్రమాదం నుంచి పుట్టిన సేవా దృక్పథం:2023లో జరిగిన ఒక భయానక కారు యాక్సిడెంట్ చల్లా సాయికుమార్ జీవితంలో పెద్ద మలుపుగా మారింది. ఆ సమయంలో తను అనుభవించిన నరకం, రక్తం కోసం ఆసుపత్రుల్లో రోగులు మరియు వారి కుటుంబాలు పడుతున్న అవస్థలు చూసి సాయి చలించిపోయారు. నాటి నుండి రక్తదానాన్ని ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించారు. ఆర్థికంగా సహాయం చేయలేకపోయినా, అంతకన్నా అత్యంత విలువైన రక్తాన్ని అందించి ఎందరికో పునర్జన్మ ప్రసాదిస్తున్నారు.9 సార్లు రక్తదాన శిబిరాలు.. తలసేమియా పిల్లలకు అండ:సమయానికి రక్తం అందక తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్న పిల్లలు పడుతున్న వేదనను సాయి గుర్తించారు. తన మిత్ర బృందంతో కలిసి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 9 సార్లు భారీ రక్తదాన శిబిరాలను (బ్లడ్ క్యాంపులు) విజయవంతంగా నిర్వహించారు.

ఎలాంటి పరిచయం లేని వ్యక్తులు ఆపదలో ఉన్నారని తెలిసినా, ఒక్క రూపాయి కూడా ఆశించకుండా వందలాది, వేలాది కుటుంబాలకు సాయికుమార్ అండగా నిలుస్తున్నారు.”రక్తం చెట్ల నుండి రాదు.. జ్యూస్ సెంటర్లలో  దొరకదు!””రక్తదానం అనేది కేవలం ఒకరి ప్రాణం కాపాడటం మాత్రమే కాదు, అది మన బాధ్యత. డబ్బుతో కొనలేని సేవ ఏదైనా ఉందంటే అది రక్తదానమే. మనం ఎవరి కోసం రక్తం ఇస్తున్నామో తెలియకపోయినా, ఆ వ్యక్తి ప్రాణం నిలబడితే లభించే సంతృప్తి అమూల్యమైనది. యువతలో ఉన్న అపోహలను వీడి, భయం లేకుండా ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలి.”— చల్లా సాయికుమార్అత్యవసర సమయంలో సాయికుమార్ విలువైన సూచనలు:తొలి ప్రాధాన్యత కుటుంబానికే ఇవ్వండి: ఆపద సమయంలో ఎవరో వస్తారని, బ్లడ్ ఇస్తారని సమయాన్ని వృథా చేసుకోవద్దు. అత్యవసర పరిస్థితుల్లో ముందుగా మీ కుటుంబ సభ్యుల్లోనే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యే వారి కోసం వెతకండి. ఒక్కొక్కసారి రక్తదాతలు అందుబాటులో ఉండకపోవచ్చు.మనం ఇస్తేనే.. రేపు మనకు వస్తుంది.

సమాజంలో ఒకరికొకరు సాయం చేసుకునే తత్వం ఉండాలి. ఎదుటివాడు ఆపదలో ఉన్నప్పుడు మనం రక్తదానం చేసి సాయపడితేనే, రేపు మనకు అవసరమైనప్పుడు మరొకరు ముందుకు వస్తారు.భవిష్యత్తును గుర్తుంచుకోండి: ఈరోజు వేరే ఎవరికో అవసరమైన రక్తం, రేపు ఏదో ఒక రోజు మీ కుటుంబంలో ఎవరికో ఒకరికి అవసరం పడొచ్చనే నిజాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి.మండల వ్యాప్తంగా ప్రశంసల జల్లు:ఎలాంటి స్వార్థం లేకుండా, సామాజిక స్పృహతో సాయికుమార్ చేస్తున్న ఈ మహోన్నత సేవలను బాధితుల కుటుంబాలు, గ్రామస్తులు, మరియు మండల వాసులు కొనియాడుతున్నారు. సాయికుమార్ ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయుడని, ఆయన స్ఫూర్తితో యువత మరింతగా రక్తదాన శిబిరాల్లో పాల్గొనాలని పిలుపునిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular