బీజేపీ కార్నర్ మీటింగ్ లో డాక్టర్ రఘు
సమావేశాలకు వందలాదిగా తరలివచ్చిన జనం
నవగీతం,మెట్ పల్లి :
ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇచ్చి అభివృద్ధికి ప్రజలు కలిసికట్టుగా నడవాలని బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్నర్ మీటింగ్ లో భాగంగా శుక్రవారం మెట్ పల్లిలోని 4, 5, 6, 7, 8, 9, 10, 20వ వార్డుల్లో బహిరంగ సమావేశాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు తెలంగాణలో నూతన దంపతులకు తులం బంగారం ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఆడపిల్లలకు స్కూటీలు, విద్యార్థులకు లాప్ టాప్ లు ఇస్తామని చెప్పి మోసం చేస్తున్నారని అన్నారు. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కిందని విమర్శించారు. మున్సిపాలిటీల అభివృద్ధికి అధిక మొత్తంలో కేంద్ర ప్రభుత్వ నిధులే ఉంటాయని, ఆ నిధులను సక్రమంగా వినియోగించకుండా పక్కదారి పట్టించి ప్రజలను మోసం చేయడం మానుకోవాలని హితువు పలికారు.

కార్నర్ సమావేశాల సందర్భంగా వివిధ వార్డుల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మెట్ పల్లి ఎన్నికల ఇంచార్జీ అమ్దాపూర్ రాజేష్, బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఏలేటి నరేందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి శ్రీనివాసన్, కార్యదర్శి పీసు రాజేందర్, నాయకులు వడ్డేపల్లి శివ, ఆయా వార్డుల బీజేపీ అభ్యర్థులు పల్లె దేవేంద్ర, పుడుకారం దివ్యారెడ్డి, కదాసు తార, ధర్మపురి స్వరూప, సంకు రంజిత, బొడ్ల వసుధ, సీహెచ్ సత్యనారాయణ, గుంటుక సదాశివ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


