నవగీతం,జగిత్యాల ప్రతినిధి :
జగిత్యాల బీర్పూర్ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకున్న అంబేద్కర్ సంఘం జిల్లా కన్వీనర్ బంగారు దీపక్ స్వామి వారికి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు దీపక్ మాట్లాడుతూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కృపా కటాక్షాలు భక్తులపై ఉండాలని, స్వామి వారి కృపాకటాక్షాలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో జీవించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తో పాటు ప్రజా సంఘాల జేఏసీ జిల్లా అధ్యక్షుడు బోనగిరి మల్లారెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి నరేష్, తదితరులు పాల్గొన్నారు.

