Saturday, April 18, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తాం..

ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తాం..

📰 Generate e-Paper Clip

బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు

నవగీతం,మెట్ పల్లి టౌన్ :

ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో మెట్ పల్లి, కోరుట్ల పట్టణాల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులకు ఒక్క అవకాశం ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని, చేతులు జోడించి నమస్కరించి ఓటును అభ్యర్థిస్తున్నామని బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు పేర్కొన్నారు.మంగళవారం మెట్ పల్లిలో పాత్రికేయులకు ఆయన పత్రిక ప్రకటన విడుదల చేశారు. మెట్ పల్లి, కోరుట్ల మున్సిపల్ లలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఎక్కువ శాతం నిధులు కేంద్ర ప్రభుత్వమే మంజూరు చేస్తుందని గుర్తు చేశారు. పెన్షన్లలో కూడా ఎక్కువ మొత్తంలో కేంద్రమే వాటా ఇస్తుందన్నారు.అంతే కాకుండా పసుపు బోర్డు ఏర్పాటు, నవోదయ పాఠశాలల మంజూరు, జాతీయ రహదారుల అభివృద్ధి, మున్సిపల్ కు ప్రత్యేక నిధులు… ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సంక్షేమ పథకంలో కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా నిధులను సమకూరుస్తుందని తెలిపారు.ఢిల్లీలోనే కాకుండా గల్లీలో కూడా మన కొరకు, అభివృద్ధి కొరకు పనిచేసే వ్యక్తి ఉండాలని పేర్కొన్నారు. కేంద్రంలో పీఎం మోడీ, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎంపీ అరవింద్ అన్న సహకారంతో మెట్ పల్లి, కోరుట్లలోని అన్ని వార్డులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular