Thursday, February 26, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలమహిళా సాధికారతే సమాజ అభివృద్ధికి మూలస్తంభం :ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్

మహిళా సాధికారతే సమాజ అభివృద్ధికి మూలస్తంభం :ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్

📰 Generate e-Paper Clip

నవగీతం, మల్లాపూర్:

మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామంలో ఈజీఎస్ నిధులు రూ.30 లక్షలతో నిర్మించబోయే మూడు మహిళా సంఘాల భవనాలకు కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా సంఘాలు ఆర్థికంగా మరింత బలోపేతం కావడానికి గ్రామీణ మహిళలకు సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈ భవనాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.

మహిళా సాధికారతే సమాజ అభివృద్ధికి మూలస్తంభమని పేర్కొన్నారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన పెద్దమ్మ తల్లి జాతరలో ఎమ్మెల్యే గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలతో కలిసి జాతర వేడుకల్లో పాల్గొని ఆశీర్వాదాలు పొందారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ,ఏపీఎం, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular