Thursday, February 26, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలనాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు

నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు

📰 Generate e-Paper Clip

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు

నవగీతం, హైదరాబాద్:

జిల్లాలో బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన జగిత్యాల జిల్లా మెట్ పల్లి, రాయికల్ కార్యకర్తలకి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పేర్కొన్నారు. హైదరాబాదులోని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయములో జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్ రిజల్ట్ పై రివ్యూ మీటింగ్ లో బీజేపీ రథ సారధి ఎన్.రామచంద్రరావు రివ్యూ చేశారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మున్సిపల్ ఎలక్షన్లలో గెలిచినా కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ నియంతృత్వ ప్రజా వ్యతిరేక పాలనను నిగ్గదీసి ప్రజల ముందుంచిన బీజేపీ పార్టీని ఎలాగైనా ఎలక్షన్లో నిలువరించాలని, వారి ఉత్సాహానికి ఎట్టి పరిస్థితుల్లోనైనా అడ్డుకట్ట వేయాలనే నెపంతో ముస్లిమ్స్, బీఆర్ఎస్ తో కలిసి బీజేపీ ఓడించాలన్న కుట్రతో రహస్య ఒప్పందాన్ని ఏర్పరచుకొని బీజేపీని నిలువరించే ప్రయత్నం చేశారన్నారు. ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్ యొక్క కుటీల నీతిని తమ కార్యకర్తలు ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ ప్రజల వద్దకి మోడీ అండతో లోకల్ అజెండాతో ముందుకు వెళ్లి విజయాన్ని సాధించారన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ ఉపాధ్యక్షురాలు, మీడియా చీఫ్ ఇంచార్జి , ట్రెజరర్, మీడియా కన్వీనర్ రాణా పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular