నవగీతం ,కొడిమ్యాల:
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చెప్యాల గ్రామానికి చెందిన మోదిగంపల్లి సురేష్ ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొందారు.ప్రస్తుతం ఆయన కరీంనగర్లోని గవర్నమెంట్ ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో భౌతిక శాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు.భౌతిక శాస్త్ర విభాగంలో “అంశంపై పరిశోధన చేసి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డా. కె. సాధన పర్యవేక్షణలో థీసిస్ సమర్పించారు. పరిశోధనను పరిశీలించిన విశ్వవిద్యాలయం ఇటీవల ఆయనకు డాక్టరేట్ ప్రకటించింది. ఈ సందర్భంగా భౌతిక శాస్త్ర విభాగానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.మోదిగంపల్లి దేవయ్య–విజయ దంపతుల చివరి సంతానమైన సురేష్, ప్రాథమిక విద్యను చెప్యాలలో పూర్తి చేసి, ఇంటర్మీడియట్ను మేడిపల్లిలోని రెసిడెన్షియల్ కళాశాలలో, డిగ్రీను కరీంనగర్లోని ఎస్.ఆర్.ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో పూర్తి చేశారు. అనంతరం ఎంఎస్సీ ఫిజిక్స్, బీఈడీని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పూర్తి చేసి, సెట్ ప్రవేశ పరీక్షలో ర్యాంకు సాధించి పీహెచ్డీలో ప్రవేశం పొందారు.కుటుంబ పోషణతో పాటు అధ్యాపక వృత్తిని కొనసాగిస్తూ ఉన్నత లక్ష్యాల సాధనలో ముందుకు సాగిన సురేష్ డాక్టరేట్ సాధించడంతో, ఆయన సహచరి లలిత, పిల్లలు హద్వితసూర్య, ప్రిషసూర్యతో పాటు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

