Thursday, April 16, 2026
ads
Homeఎడిటోరియల్ఉద్యమ జెండా పట్టిన చేతులకు అండగా ప్రభుత్వం

ఉద్యమ జెండా పట్టిన చేతులకు అండగా ప్రభుత్వం

📰 Generate e-Paper Clip

మంత్రి పొన్నం ప్రభాకర్ తీపి కబురుతో ఉద్యమ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం

నవగీతం, పెద్దపల్లి:

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారుల సంక్షేమంపై ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం పట్ల ఉద్యమకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.శనివారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ మరియు జిల్లా అధ్యక్షుడు గుండేటి ఐలయ్య యాదవ్,జిల్లా మహిళా అధ్యక్షురాలు దుబాటి చంద్రకళ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం కోసం గల్లీ నుండి ఢిల్లీ దాకా సాగిన తొలి,మలి దశ ఉద్యమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తగిన న్యాయం చేయబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఎన్నికల హామీ మేరకు అర్హులైన ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించాలని,కేవలం ఎఫ్ఐఆర్ ఉన్న వారినే కాకుండా ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి అన్ని రకాలుగా నష్టపోయిన వారిని కూడా గుర్తించి న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా 13 ఏళ్ల పాటు తమ జీవితాలను పక్కన పెట్టి పోరాడామని,ప్రస్తుతం ఎంతో మంది ఉద్యమకారులు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఏఐసీసీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా భూమి మరియు పెన్షన్ సౌకర్యాలు కల్పించడం హర్షణీయమని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రి శ్రీధర్ బాబు,ఎమ్మెల్యేలు విజయ రమణారావు,మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్,ఎంపీ గడ్డం వంశీకృష్ణ,ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ నాయకత్వంలో ఉద్యమకారులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. ఉద్యమకారుల గుర్తింపు కోసం ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించడం తమకు తీపి కబురు అని వారు తెలిపారు.ఈ సమావేశంలో పొత్తు జ్యోతి రెడ్డి,లలిత ఠాకూర్,రాష్ట్ర కార్యదర్శులు బత్తుల శంకర్,కందుల సదాశివ,మాడ నారాయణ రెడ్డి,జర్నలిస్టు ఫోరం నాయకులు సురేష్ గౌడ్,ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి,కందుల అశోక్ పటేల్,జునుగురి సుధాకర్,మంద భాస్కర్,కాల్వల తిరుపతి,చంటి నరసక్క,ఆలేటి ఎల్లమ్మ,గట్ల రవీందర్ రెడ్డి,మొలుగూరి నరసయ్య,రూపా ఠాగూర్,గడ్డం లక్ష్మి,పెంచాల మల్లయ్య, గుజ్జుల పద్మ,జ్యోతి ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular