అవార్డు అందుకున్న ప్రధానోపాధ్యాయులు జూపాక సుదర్శన్
నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
జిల్లాస్థాయిలో బీర్పూర్ మండలం నుండి పి ఎం శ్రీ ఎంపీపీ ఎస్ బీర్పూర్ ప్రాథమిక పాఠశాలకు స్వచ్ఛ హరిత విద్యాలయ అవార్డు కు ఎంపికైంది, పీఎం శ్రీ ఎంపీపీ ఎస్ బీర్పూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాష్ట్రస్థాయి హరిత మిత్ర అవార్డు గ్రహీత జూపాక సుదర్శన్ ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎం పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించడంలో కృషి చేశారు , ఇందులో భాగంగా త్రాగునీటి కొరకు మినరల్ వాటర్ సౌకర్యం, ఫ్లవర్స్ గార్డెన్ ,హైజిన్ , శానిటేషన్, హ్యాండ్ వాష్, టాయిలెట్లు పరిశుభ్రత, మరియు పీఎం పోషణలో భాగంగా పాఠశాల ఆవరణలో సేంద్రియ ఎరువుల ద్వారా కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేశారు, వీటి నుండి విద్యార్థులకు మధ్యాహ్న భోజనములో ప్రతిరోజు వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం అందిస్తున్నారు, తడి చెత్త ,పొడి చెత్త, ప్లాస్టిక్ సంచులు వస్తువుల నిషేధం పై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ, విద్యార్థుల ప్రవర్తనలో మార్పు, రైన్ వాటర్ హార్వెస్టింగ్ ఏర్పాటు చేయడం ద్వారా నీటిని పొదుపు చేయడం,సోలార్ పానల్ ఏర్పాటు ఏకో క్లబ్ కమిటీ ఏర్పాటు లో భాగంగా మొక్కలు నాటడం వాటిని పరిరక్షణ, తరగతికి ఒక డస్ట్ బిన్ ఏర్పాటు చేయడం, పైప్ కంపోస్ట్ , వర్మి కంపోస్టులు ఏర్పాటు చేసి వాటి ద్వారా వచ్చిన ఎరువులను కిచెన్ గార్డెన్ కు వేయడం, వృధాగా పోతున్న నీరును మొక్కలకు అందించడం, వాటర్ టెస్టింగ్, మొదలు వాటిని ఏర్పాటు చేయడం ద్వారా సర్వేలో మా పాఠశాలకు 5 స్టార్ రేటింగ్ వచ్చింది.

ప్రభుత్వం గుర్తించి పాఠశాలకు స్వచ్ఛ హరిత విద్యాలయం పురస్కారం గౌరవనీయులు జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ చేతుల మీద నుండి జిల్లా విద్యాధికారి కే. రాము చేతుల మీద నుండి ప్రశంస పత్రం మేమెంటో లను ప్రధానోపాధ్యాయులు జూపాక సుదర్శన్ కు అవార్డును ఇచ్చి ప్రోత్సహించి అభినందించారు, ఈ కార్యక్రమంలో విద్యాధికారి కే రాము , ఏ ఎం ఓ సెక్టోరల్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి, సెక్టోరల్ ఆఫీసర్ కోరుట్ల మహేష్ , సెక్టోరల్ ఆఫీసర్ చిప్ప సత్యనారాయణ , పరీక్షల విభాగం అధికారి పి. నరేందర్ మరియు 18 మండలాల విద్యాధికారులు , తదితరులు పాల్గొన్నారు, ఈ సందర్భంగా పాఠశాలకు అవార్డు వచ్చినందుకు ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు

