Friday, April 17, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఈడబ్ల్యూఎస్ 10శాతం రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో అమలు చేయాలి

ఈడబ్ల్యూఎస్ 10శాతం రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో అమలు చేయాలి

📰 Generate e-Paper Clip

ఢిల్లీ ధర్నాలో ఓసి జేఏసీ జిల్లా కన్వీనర్ రాజన్న

నవగీతం,జగిత్యాల ప్రతినిధి:

దేశంలో  అగ్రవర్ణాలు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక అన్యాయాలను ప్రభుత్వం గుర్తించి న్యాయం చేయాలని ఓసి సామాజిక సంక్షేమ సంఘం జగిత్యాల జిల్లా కన్వీనర్ మహంకాళి రాజన్న డిమాండ్ చేశారు. ఓసీ సంక్షేమ సంఘాల ఐక్యవేదిక, న్యూఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద సోమవారం మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో రాజన్న, సిహెచ్ వెంకట ప్రభాకర్ రావులు మాట్లాడుతూ  స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లకు పైగా గడిచినా ఓసి వర్గాలు అనేక రంగాల్లో వెనుకబాటుకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, ఉద్యోగాలు, ఉపాధి, సంక్షేమ పథకాల విషయంలో సరైన అవకాశాలు లేక ఆర్థికంగా బలహీన స్థితిలో ఉన్న ఓసి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని వారు విమర్శించారు. ఈ రిజర్వేషన్లు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని, వాస్తవంగా ఓసి యువతకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. న్యాయమైన రాజ్యాంగం హామీ ఇచ్చిన సమానత్వ సూత్రాలను అమలు చేయకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని రాజన్న ప్రభాకర్ రావులు ఆరోపించారు. ఓసి వర్గాల సమస్యలపై అన్ని రాజకీయ పార్టీలు స్పష్టమైన వైఖరి ప్రకటించాలని, రాబోయే కాలంలో ఈ అంశాన్ని ప్రజా ఉద్యమంగా తీసుకెళ్తామని వారు హెచ్చరించారు. ఓసి వర్గాల హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని, యువత, ఉద్యోగార్థులు ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు.ఈ ధర్నాలో జాతీయ ఓసి జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, చైర్మన్ నల్ల సంజీవరెడ్డి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి, బద్దురి వెంకటేశ్వర్ రెడ్డి,జగిత్యాల జిల్లా ఓసి ప్రతినిధులు సిరిసిల్ల రాజేందర్ శర్మ, బద్దం నారాయణ రెడ్డి, కటకం చంద్రమౌళి, తెలుగు రాష్ట్రాల ప్రతినిధులతో పాటు వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన ఓసి నేతలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular