Friday, April 17, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలమాదకద్రవ్యాల నిర్మూలనకు సమిష్టి కృషి

మాదకద్రవ్యాల నిర్మూలనకు సమిష్టి కృషి

📰 Generate e-Paper Clip

జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

నవగీతం, జగిత్యాల ప్రతినిధి :

జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు సమిష్టి కృషితో ముందుకెళ్తామని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్  బి. సత్యప్రసాద్ , జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా విద్యాసంస్థల పరిసరాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, అనుమానాస్పద వ్యక్తులపై  ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. యువతలో మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణను అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవడంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. విద్యాసంస్థల పరిసరాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, యువతను దారి తప్పించే వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై స్పష్టమైన అవగాహన కల్పించాలని తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి యువతను రక్షించే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలోనూ ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి మాదకద్రవ్యాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని సూచించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, బాధితులకు అవసరమైన పునరావాస సేవలు అందించేందుకు కూడా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. సమాజంలోని ప్రతి ఒక్కరి సహకారంతో మాదకద్రవ్యాల రహిత జిల్లాను నిర్మించగలమని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ… జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు పోలీసు శాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు తెలిపారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై కఠిన నిఘా ఏర్పాటు చేశామని వెల్లడించారు. విద్యాసంస్థల పరిసరాల్లో ప్రత్యేక పోలీసు బృందాలను మోహరించి, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. యువతను లక్ష్యంగా చేసుకుని మాదకద్రవ్యాల విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా సరిహద్దుల వద్ద తనిఖీలు మరింత కట్టుదిట్టం చేసి, అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమాచారం అందించే వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచి, వారి భద్రతకు పూర్తి హామీ ఇస్తామని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు పోలీసు శాఖతో సమన్వయం చేసి యువతలో అవగాహన కల్పించేందుకు ముందుకు రావాలని కోరారు. సమాజ సహకారంతోనే మాదకద్రవ్యాల రహిత జిల్లాను నిర్మించగలమని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్  బి.రాజ గౌడ్, మెట్ పల్లి, కోరుట్ల ఆర్డీవోలు శ్రీనివాస్, జివాకర్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి కె. రాజ్ కుమార్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి రఘువరన్, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి సుజాత, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి నారాయణ, జిల్లా విద్యాధికారి  కె. రాము, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular