నవగీతం, మల్లాపూర్ :
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వాల్గొండ గ్రామంలో శ్రీ రామలింగేశ్వర త్రికూట ఆలయ కమిటీ చైర్మన్ పందిరి నాగరాజు వినూత్నంగా ఆలోచించి ఆడబిడ్డ కుటుంబాలకు అసరా అవుతున్నారు. వివరాల్లోకి వెళితే వాల్గొండ గ్రామంలో పళ్ళికొండ గంగరాజాం – రాజు రెండవ కుమార్తె తులసి అనే పెళ్లి కూతురికి కళ్యాణ కానుక గా పట్టు చీరను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటి నుండి వాల్గొండ గ్రామములో ఏ ఆడపడుచు వివాహము జరిగిన ఆడపడుచు కు కళ్యాణ కానుకగా తన వంతు పట్టుచీరను బహుమతిగా తాను దేవాలయ కమిటీ చైర్మన్ గా ఉన్నన్ని రోజులు అందజేస్తానని తెలిపారు. గ్రామంలో కుల మత భేదాలు లేకుండా ప్రతి ఆడపడుచుకు ఈ కళ్యాణ కానుకను అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆడపడుచు తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు

