Sunday, September 20, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలస్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాద రావు జయంతి వేడుకలు

స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాద రావు జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

నవగీతం, మెట్ పల్లి:

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసననసభ స్పీకర్,ప్రజా బంధువు స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాదరావు జయంతి సందర్భంగా మెట్ పల్లి లోని టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయం లో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్,రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ ప్రధాన కార్యదర్శి అందే మారుతి,మెట్ పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబ్భుదిన్ పాషా, మల్లాపూర్ మండల ఫిషెర్మన్ అధ్యక్షులు రొడ్డ రాజు, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కోడిమ్యాల దీపక్ రాజ్, ఇబ్రహీంపట్నం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నల్లూరి సాగర్, ఎన్నెడ్ల రాములు, కల్లెడ గంగాధర్,ఎండి జాఫర్, తోగిటి నాగరాజు, బైండ్ల శ్రీకాంత్, ఎండి అన్వర్ కాంగ్రెస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular