జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
నవగీతం, సూర్యాపేట:
మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో వసతి, సౌకర్యాలు మెరుగ్గా ఉండాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. బుధవారం బాలికల రెసిడెన్షియల్ కళాశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా హాస్టల్లోని డైనింగ్ హాల్, స్టోర్ రూమ్,కిచెన్ షెడ్, లైబ్రరీ, కలెక్టర్ పరిశీలించారు. కిచెన్ రూమ్ లో విద్యార్థులకు వడ్డించుటకు తయారుచేసిన భోజనం, పప్పు, కూరలు, సాంబారు పరిశీలించారు, కూరగాయలు, పప్పులు, వంట నూనెలు, తదితర నిత్యావసరాలను కలెక్టర్ తనిఖీ చేసి తాజా కూరగాయలు, నాణ్యమైన వంట పదార్థాలను వంటల్లో వినియోగించాలన్నారు, వంట సామాన్లు, కూరగాయలు వెలుతురు తగిలే విధంగా పైన టేబుల్ మీద ఉంచుకోవాలని అన్నారు.

డైనింగ్, వాష్ ఏరియా ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ అన్నారు. తదుపరి విద్యార్థులతో మాట్లాడారు పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలన్నారు. విద్యార్థులు కలెక్టర్ ల్యాబ్,బిల్లింగ్, డైనింగ్ టేబుల్, బెడ్స్ పిల్లలు చైతర వసతులు కల్పించాలని కోరారు.కళాశాలలో ఫిర్యాదులు బాక్స్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రిన్సిపల్ ను ఆదేశించారు ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి నరసింహ, ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.

