Friday, March 6, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలప్రజాపాలన–ప్రగతి 99 రోజుల కార్యక్రమ నిర్వహణ

ప్రజాపాలన–ప్రగతి 99 రోజుల కార్యక్రమ నిర్వహణ

📰 Generate e-Paper Clip

నవగీతం,కొడిమ్యాల:

కొడిమ్యాల గ్రామ పంచాయతీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి 99 రోజుల ప్రణాళికలో భాగంగా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించి,అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రతిజ్ఞ చేశారు.తదుపరి గ్రామ పంచాయతీ కార్యాలయం మరియు ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణాలను శుభ్రపరిచే కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమంలో కొడిమ్యాల ఎంపీడీఓ, ఎంపీవో, కొడిమ్యాల గ్రామ సర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డి, ఉపసర్పంచ్ గుర్రం నర్సయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొండూరి రాజేష్, గ్రామ వార్డ్ సభ్యులు, గ్రామ పంచాయతీ ఈఓ, ఏపీఎం, సీసీలు, అంగన్‌వాడీ టీచర్లు, సీఏలు మరియు మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular