Saturday, April 25, 2026
ads
Homeతెలంగాణపెద్దపల్లిఅదనపు కలెక్టర్ కుటుంబ వేడుకలో జిల్లా ప్రముఖుల సందడి

అదనపు కలెక్టర్ కుటుంబ వేడుకలో జిల్లా ప్రముఖుల సందడి

📰 Generate e-Paper Clip

వివాహ వేడుకకు హాజరైన విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ప్రతినిధులు

నవగీతం, పెద్దపల్లి:

గతంలో పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ గా పనిచేసి,జిల్లా ప్రజల మన్ననలు పొంది,ప్రస్తుతం గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న మంతెన లక్ష్మీనారాయణ-శ్రీదేవి దంపతుల ప్రథమ పుత్రుడు చిరంజీవి అభినవ్-డాక్టర్ ప్రణవిల వివాహ మహోత్సవం గురువారం హైదరాబాద్‌లోని ఎస్.పి.ఆర్ శ్రీరస్తు కన్వెన్షన్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు పెద్దపల్లి జిల్లా నుండి ప్రజా ప్రతినిధులు,వివిధ కుల సంఘాల నాయకులు, ప్రభుత్వ అధికారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యంగా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ప్రతినిధులు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.సంఘం జిల్లా అధ్యక్షులు భీమోజు సురేందర్ చారి,రాష్ట్ర ఉపాధ్యక్షులు చెల్లోజు రాజు, అఖిల భారత మహాసభ రాష్ట్ర నాయకులు కౌలే జగన్నాధం,బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ కుందరం గణేష్ చారి,జిల్లా యూత్ అధ్యక్షులు గర్రెపల్లి క్రాంతి కుమార్, అనంతోజు బ్రహ్మచారి, మాతృ సంఘం రాష్ట్ర నాయకులు లాల్కోట వెంకటాచారి, మదన్ మోహన్,మారోజు సుదర్శన్ చారి,వడకాపురం మురళి తదితరులు వధూవరులను ఆశీర్వదించి పుష్పగుచ్ఛాలను అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ లక్ష్మీనారాయణ పెద్దపల్లిలో అదనపు కలెక్టర్ గా పనిచేసిన కాలంలో సామాన్య ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేవారని కొనియాడారు. ముఖ్యంగా విశ్వబ్రాహ్మణుల సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన చొరవ,వృత్తినిపుణుల పట్ల ఆయనకు ఉన్న గౌరవం మరువలేనివని గుర్తు చేసుకున్నారు.అధికారిక బాధ్యతలే కాకుండా,సామాజిక వర్గాలతో ఆయన కొనసాగించిన ఆత్మీయ అనుబంధం కారణంగానే తామంతా ఈ వేడుకకు హాజరైనట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో విశ్రాంత కలెక్టర్లు ముద్దసాని పురుషోత్తం రెడ్డి,సంకిడి ప్రభాకర్ రెడ్డిలతో పాటు వివిధ హోదాలో ఉన్న ప్రభుత్వ అధికారులు,ప్రజా ప్రతినిధులు మరియు లక్ష్మీనారాయణ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో వివాహ వేదిక వద్ద కోలాహలం నెలకొంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular