Wednesday, March 11, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలవైద్య శిబిరాన్ని వినియోగించుకోండి : డాక్టర్ వాహిని

వైద్య శిబిరాన్ని వినియోగించుకోండి : డాక్టర్ వాహిని

📰 Generate e-Paper Clip

నవగీతం, మల్లాపూర్:

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మల్లాపూర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ నెల 14 వ తేదీ శనివారం రోజున ఉదయం 9 గంటలకు స్పెషలిస్ట్ డాక్టర్లచే వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని డాక్టర్ వాహిని తెలిపారు.ఈ వైద్య శిబిరానికి జనరల్ ఫిజీషియన్, ఆర్థోపెడిక్ (బొక్కల) డాక్టర్, స్త్రీలవైద్యనిపుణురాలు, దంత వైద్యులు, పిల్లల వైద్య నిపుణులు, నేత్ర వైద్యులు వస్తున్నారు. కావున మల్లాపూర్ మండల పరిసర ప్రాంతాల్లో గ్రామ ప్రజలందరూ వినియోగించు కోగలరని ఈ వైద్య శిబిరానికి సర్పంచ్లు, వార్డు సభ్యులు సహకరించి ఈ వైద్య శిబిరాన్ని విజయవంతం చేయాలని వైద్యాధికారి డాక్టర్ వాహిని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular