Wednesday, March 11, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలనిలకడ లేని అధికారులు పట్టు తప్పుతున్న మండల పరిషత్ పాలన

నిలకడ లేని అధికారులు పట్టు తప్పుతున్న మండల పరిషత్ పాలన

📰 Generate e-Paper Clip

అవగాహన లేని క్షేత్రస్థాయి అధికారులు

నవగీతం, ఇబ్రహీంపట్నం:

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిషత్ పాలన రోజురోజుకు క్రమం లేకుండా అదుపుతప్పి పోతుంది అనడానికి పూర్తిస్థాయి అధికారులు లేకపోవడమేనని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. మండల పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి గ్రామాల్లో ఉండే పంచాయతీ కార్యదర్శుల పై ఉన్నత అధికారిగా చలామణి చేస్తూ పాలన సరళిని క్షేత్ర స్థాయి అధికారులకు వివరిస్తూ పాలను పారదర్శకంగా కొనసాగిస్తారు. కాని ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో గతంలో ఎంపీడీవో పనిచేసిన ప్రభు బదిలీపై కొత్తపెళ్లి కి వెళ్ళగా మల్లాపూర్ ఎంపీడీవో గా పని చేసిన రాజేందర్ రెడ్డికి ఇన్చార్జి బాధ్యతలను అప్పగించారు. ఆయన సుమారు ఆరు నెలలు ఇంచార్జ్ పాలన చేసి రిటైర్డ్ అయ్యారు. అనంతరం ఎంపీడీవో గా చంద్రశేఖర్ ఇబ్రహీంపట్నం కు వచ్చారు. సుమారుగా సంవత్సరం కాలం గడిపి రిటైర్డ్ అయ్యారు. అనంతరం కోరుట్ల ఎంపీడీవో గా ఉన్న ఓదెల రామకృష్ణ కు కొన్ని రోజులు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. అనంతరం మళ్లీ సారంగపూర్ నుండి సలీం ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించారు. సుమారు రెండు నెలలు పని చేస్తున్న తరుణంలో గ్రూప్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఇబ్రహీంపట్నం ఎంపీడీవో గా చిప్ప గణేష్ వచ్చారు. ఆయన వచ్చి సుమారు రెండు నెలలు గడవక ముందే మళ్లీ 45 రోజుల ట్రైనింగ్ పై వెళ్లారు. దీంతో మళ్లీ కోరుట్ల ఎంపీడీవో ఓదెల రామకృష్ణకు ఇబ్రహీంపట్నం ఇన్చార్జి ఎంపీడీవోగా బాధ్యతలను అప్పజెప్పారు. అయితే చిప్ప గణేష్ ఎంపీడీవో గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఓ గ్రామానికి చెందిన వ్యక్తులు ఓ స్థలం విషయం ఎంపీడీవో కు వినతి పత్రం ఈయగా, వినతి పత్రాన్ని తీసుకున్న ఎంపీడీవో ఎంపీవోతో విచారణ చేర్పిస్తానని వినతిపత్రం ఇచ్చిన వ్యక్తులకు తెలపడంతో వెనుతిరిగారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ గ్రామానికి చెందిన వ్యక్తులు ఇచ్చిన వినతి పత్రాన్ని ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి చెప్పడంతో పంచాయతీ కార్యదర్శి అతి ఉత్సాహంతో గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఆ వినతి పత్రాన్ని చదివి గ్రామస్తులకు తెలియపరిచింది. సంబంధంలేని ఆ విషయాన్ని ఆ గ్రామసభలో చదవడంతో ఆ గ్రామంలో రభస మొదలైంది. అలాంటివి చదవాల వద్ద అనే ఆలోచన లేకుండా చదవడంతో పెద్ద గందరగోళం ఏర్పడింది. ఇలాంటి అవగాహన లేని అధికారులతో ఇంకెన్ని సమస్యలు తలెత్తుతాయోనని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు దృష్టి సారించి అనుభవం కలిగిన అధికారులను నియమించాలని మండల ప్రజలు కోరుతున్నారు. గ్రామాల్లో నిబంధనలు అతిక్రమించి నిర్మాణాలు గ్రామీణ ప్రాంతాల్లో నూతనంగా నిర్మాణం చేస్తున్న గృహ నిర్మాణాలు నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మిస్తున్న క్షేత్రస్థాయిలో ఉన్న పంచాయతీ కార్యదర్శులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు తప్ప ఆపే పరిస్థితి లేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రతినిత్యం ఆ అధికారులు క్షేత్రస్థాయిలో చూస్తున్న నిబంధనలు అతిక్రమించి చేస్తున్నారని చెప్పకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular