Wednesday, March 11, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో ముఖ్యమంత్రి ఆదేశాలు అమలు చేయాలి

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో ముఖ్యమంత్రి ఆదేశాలు అమలు చేయాలి

📰 Generate e-Paper Clip

అధికారులు , ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకొని ముందుకు సాగాలి

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి  ఆదేశాలను అధికారులు తూచ తప్పకుండా పాటించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లాలోని మున్సిపల్ చైర్మన్లు వార్డు కౌన్సిలర్లు, గ్రామ సర్పంచులకు ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక అవగాహన మరియు శిక్షణ కార్యక్రమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.జగిత్యాల జిల్లా కేంద్రంలోని సుమంగళి గార్డెన్ లో జరిగిన కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, జగిత్యాల మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి, ధర్మపురి మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి, మెట్ పల్లి మున్సిపాలిటీ చైర్మన్ లింబాద్రి, కోరుట్ల మున్సిపల్ చైర్మన్ వసంత, రాయికల్ మున్సిపల్ చైర్మన్ , కలెక్టర్ సత్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వం తీసుకున్న 99 రోజుల ప్రణాళికలో ప్రతి ఒక్కరు తమ బాధ్యత గుర్తించుకొని 10 అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి కోరారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యంగా పెండింగ్ ఫైళ్ళు క్లియరెన్స్ పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఈవిషయంలో జిల్లా కలెక్టర్ ప్రతిరోజు సమీక్ష నిర్వహించాలని మంత్రి సూచించారు. స్థానిక సంస్థలకు కొత్తగా వచ్చిన ఎన్నికైన సర్పంచులు వార్డు కౌన్సిలర్లు ప్రజల అవసరాలను గుర్తించాలని మంత్రి కోరారు. ఇందుకు అవసరమైన నిధులు తీసుకురావడానికి తనవంతుగా కృషి చేస్తానని మంత్రి తెలిపారు.

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో అధికారులు బాధ్యత మెలగాలని ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని మంత్రి కోరారు.గోదావరి పుష్కరాలకు నిధుల కొరత లేకుండా చర్యలు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలకు నిధుల కోరత లేకుండా చర్యలు తీసుకోవాలని క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో కోరినట్లు మంత్రి తెలిపారు. గతంలో పుష్కరాలు జరిగిన సమయంలో అప్పటి ప్రభుత్వం ముందస్తుగా నిర్ణయాలు తీసుకోకపోవడంతో పుష్కరాల సమయంలో భక్తులు ఇబ్బంది పడ్డారని మంత్రి గుర్తు చేశారు. ఈసారి పుష్కరాలకు ప్రభుత్వం ముందుగానే పనులు పూర్తి అయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకుంటుందని మంత్రి వివరించారు. జగిత్యాల జిల్లా సాగునీటి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. గిరిజన సంక్షేమ మంత్రిగా జగిత్యాల జిల్లాలో అన్ని గిరిజన గ్రామాలు, తండాలకు రవాణా సౌకర్యం కోసం నిధుల మంజూరికి ప్రత్యేక నిధులు కేటాయిస్తానని మంత్రి తెలిపారు. ఇందుకు అవసరమైన అంచనాలు తయారు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. జగిత్యాల సమీపంలో చెల్ గల్ గ్రామంలోని భూముల్లో కేంద్రీయ విద్యాలయం లేదా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం కేటాయించడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

ఇటీవల కొందరు నాయకులు చెల్ గల్ లో పర్యటించి అవాకులు చవాకులు మాట్లాడారని మంత్రి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి వివరించారు. రానున్న మూడు సంవత్సరాలు అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నామని మంత్రి వివరించారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు సామాజిక బాధ్యతతో పనిచేయాలని కోరారు. సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి తప్పుడు ప్రచారం మానుకోవాలి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే మంత్రిని కోరారు. ఈ కార్యక్రమానికి హాజరైన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ పార్టీలు వేరైనా సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి మనస్సున్న నాయకుడని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చేయాలని, కొత్త ఎన్నికైన నేతలు హక్కులు, బాధ్యత తెలుసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular